బీజేపీ చీఫ్ అమిత్ షా రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ మేరకు అయన పర్యటన షెడ్యుల్ ఖరారు అయింది.శుక్రవారం ఉదయం 10 గంటలకు అయన బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.ఈ సందర్బంగా ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకనున్నారు . అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఎయిర్ పోర్ట్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అమిత్ షా. అక్కడి నుంచి నేరుగా పార్టీ ఆఫీస్ కు వెళతారు. ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. అనంతరం ప్రముఖులతో భేటీ అవుతారు. పత్రిక, టీవీ ఛానల్స్ అధినేతలతో ఈ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాత్రి 7 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళతారు.