ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన నేతలకంటే..కార్యకర్తల కంటే సర్వేలను..తన అస్థాన మీడియాను నమ్ముతాడంటే అతిశ్యయోక్తి కాదేమో.అంతగా ఆయన సర్వేలను ,పచ్చ మీడియాను నమ్ముతారు..తాజాగా తన ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వే బాబు గుండెల్లో రైళ్ళను పరుగెట్టిస్తుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన,బీజేపీ పార్టీలతో కూటమీగా ఏర్పడి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోని అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఈ సారీ మాత్రం ఆ ఆవకాశం లేకుండా పోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో బాబు అస్థాన మీడియా నిర్వహించిన సర్వేలో “గత నాలుగేండ్లుగా గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హమీను నెరవేర్చలేదు. విభజన చట్టం ప్రకారం అమలు కావాల్సిన హమీలను సాధించడంలో విఫలమవ్వడంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.గత నాలుగేండ్లుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాడటమే కాకుండా..గత ఎన్నికల్లో టీడీపీచ్చిన హామీలను నెరవేర్చాలని పోరాటం చేయడమే కాకుండా ప్రత్యేక హోదాను,రైల్వేజోన్ లాంటి హామీలను నెరవేర్చాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మీద చేస్తున్న పోరాటానికి ఏపీ ప్రజలు వైసీపీ వైపు చూస్తున్నారు.
వైసీపీ పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట పదిహేడు స్థానాలను గెలుచుకుంటుంది..టీడీపీ ,బీజేపీ,కాంగ్రెస్,జనసేన పార్టీలు మిగిలిన యాబై ఎనిమిది స్థానాల్లో గెలుపొందుతుందని తేల్చి చెప్పిందంటా.అంతే కాకుండా ఒకవేళ వైసీపీ బీజేపీ పార్టీతో కల్సి పోటి చేస్తే నూట పదిహేడు స్థానాలు రావని తేలిందంటా..ఒకవేళ టీడీపీ కూడా బీజేపీతో లేదా కాంగ్రెస్ తో ఎవరితో కల్సి బరిలోకి దిగిన కానీ అధికారం దక్కదని .అది వృధా ప్రయాస అని తేల్చి చెప్పింది.మొత్తంగా గత నాలుగేండ్లుగా అన్నిరంగాల్లో విఫలమైన టీడీపీను ప్రజలు పక్కన పెట్టి వైసీపీకి ఆవకాశమివ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆస్థాన మీడియా చేసిన సర్వేలో తేలింది ..ఈ విషయం తెల్సిన దగ్గర నుండి ఏమి చేయాలో ఆర్ధం కాక తలపట్టుకోవడం బాబు వంతైంది అంట ..