గుడివాడ నాది. గుడివాడ గడ్డపై నన్ను ఓడించే దమ్ము మీకుందా..? అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లకు బహిరంగ సవాల్ విసిరారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కాగా, మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌లక సవాల్ విసిరారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బహిరంగ సవాల్ విసిరినా కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతోపాటు, టీడీపీ అధిష్టానం నేతలు కిమ్మనక ఉండటంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. బహిరంగ సవాల్ విసురుతూ గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే తొడలు కొడుతుంటే.. ఆయన సవాలుకు ధీటుగా సమాధానం చెప్పే టీడీపీ నేత కృష్ణా జిల్లాలో లేడా..? అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకులను సైత తొలచివేస్తోంది.
ఇదిలా ఉండగా, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గుడివాడలో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ పాదయాత్రతో గుడివాడ వైసీపీ శ్రేణుల్లో హుషార్ డబుల్ అయిందని, ఆ క్రమంలోనే వైసీపీని మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆ క్రమంలోనే టీడీపీ నేతలు ఊహించని విధంగా కొడాలి నాని సవాల్ చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.