టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే తనకు కర్నూలు సిటీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. టీజీ వెంకటేష్ అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను ప్రశ్నించడంపై ఎస్వీ తప్పుపట్టారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రమంత్రిగా ఉన్నారని, అతనికి అధిష్టానంతో మాట్లాడి అభ్యర్థులను ప్రకటించే అధికారం ఉందని టీజీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు తనకు టీజీ వెంకటేష్ తో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. మొత్తానికి కర్నూలులో లోకేష్ వ్యాఖ్యల చిచ్చు బాగానే రాజుకుందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎన్నికల ఇంకా ఏం జరుగుతుందో అని తెలియక తిక మక తెలుగు తమ్ముళ్లు పడుతున్నారు
