సోనాలి బింద్రే. ఒకప్పుడు బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా దేశంలోని సినీ ఇండస్ట్రీల్లోనూ నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం సోనాలి బింద్రే క్యాన్స్ వ్యాధి భారినపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలోని ఓ ప్రముఖ
వైద్యశాలలో సోనాలి బింద్రే క్యాన్సర్‌కు చికిత్స పొందుతోంది. అయితే, సోనాలి బింద్రే ఫ్యామిలీ సమేతంగా అమెరికా వెళ్లినట్టు సమాచారం.
సోనాలి బింద్రేకు క్యాన్సర్ అని తెలిసి వివిధ దేశాల్లోని ఆమె అభిమానులు, ప్రముఖులు ఆమెపై సానుభూతి వ్యక్త పరుస్తూ సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెప్పారు. దీనికి స్పందించిన సోనాలి బింద్రే తనలో ధైర్యం నింపుతున్న వారికి రుణపడి ఉంటాను అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సానుకూల ధృక్పథంతో సూర్యోదయం కోసం ఎదురు చూస్తుంటాను, ప్రతీ రోజు నాకు సవాలే అంటూ తన మనసులోని మాటను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచింది.
ఇదిలా ఉండగా, క్యాన్సర్ చికిత్స చేయించుకున్న సోనాలి బింద్రే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ముఖం ఎంతో ముభావంగాను, బక్కచిక్కి పోయి ఉంది. ఆమె ఎంత బాధలో ఉన్నా ముఖంపై చెరగని చిరునవ్వుతో ఉండటంతో.. నెట్టిల్లు వేదికగా ఆమె మనో ధైర్యాన్ని పొగుడుతున్నారు.