ఇటీవల కాలంలో తెలుగు చలన చిత్ర సీమలో చిన్న సినిమాల హవా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి RX 100. చిత్రం పేరే RX 100. అయితే, ఈ పేరు వినేందుకు కాస్త వింతగా ఉన్నా.. దాని వెనుక స్టోరీ చాలానే ఉందంటున్నారు చిత్ర బృందం. ఈ చిత్రం టైటిల్‌ను యమహా బైక్ పేరు నుంచి తీసుకోబడిందని, కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మాన సారధ్యంతో డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదల కానుందని చిత్ర బృందం తెలిపింది.