కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ప్రజలందరి సాక్షిగా బట్టబయలు అయ్యాయి. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. నారా లోకేష్ జిల్లా పర్యటనలో బాగంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీ స్థానానికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు. దీంతో టీజీ వెంకటేష్ తీవ్ర అసహనానికి గురయ్యారు . నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారంటూ మండిపడ్డారు. అయితే ఇప్పుడు ఏపీలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు బాగా అర్థం అయిందంట..ఏమనో తెలుసా….ఒక్క జిల్లా..ఒక్క పర్యటనతో తెలుటగు దేశం పార్టీ ఓటమీకి దారి చూపారు నారా లోకేష్ ..రాష్ట్రమంతా చేస్తే..గోవిందా అని అనుకుంటున్నరంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతక ముందు సభల్లో ఏం మాట్లాడినాడో ఆ మాటలు కూడ తేగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైన చినబాబు మాటలు సోషల్ మీడియాలో టీడీపీ నేతలకే తగులుతున్నాయి