Home / ANDHRAPRADESH / కర్నూల్ పర్యటనలో నారా లోకేష్ దెబ్బకు..వైసీపీలోకి టీజీ వెంకటేష్‌..!

కర్నూల్ పర్యటనలో నారా లోకేష్ దెబ్బకు..వైసీపీలోకి టీజీ వెంకటేష్‌..!

కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. మంత్రి నారా లోకేష్‌ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్‌ రెడ్డి, లోక్‌సభ స్థానానికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు.

అయితే చాలా కాలంగా ఆ రెండు స్థానాలు తమవే అనుకుంటున్న టీజీ వెంకటేష్‌కు లోకేష్‌ ప్రకటన రుచించలేదు. దీంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎమ్మెల్యే స్థానాలపై టీజీ అండ్‌ కో ఆశలు పెట్టుకుంది. అయితే అకస్మాత్తుగా మంత్రి 2019 ఎన్నికల్లో అభ్యర్థులు వీళ్లేనంటూ ప్రకటించడంతో టీజీ తీవ్ర అసహనానికి గురయ్యారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారంటూ మండిపడ్డారు. మంత్రి ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. అంతేకాదు టీజీ వెంకటేష్‌, వైసీపీ పార్టీ ముఖ్యనేతలతో టచ్‌లోకి వచ్చారట. 2019 ఎన్నికల్లో తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్‌ని ఆశిస్తున్నారు టీజీ వెంకటేష్‌. కానీ, టీజీ వెంకటేష్‌ కోరికని నారాలోకేష్‌ లైట్‌ తీసుకున్నారు. దాంతో, టీజీ వెంకటేష్‌ జిల్లాలో పార్టీ భ్రష్టుపట్టిపోవడం ఖాయం..’ అంటూ టీజీ వెంకటేష్‌, నారా లోకేష్‌ తీరుపై సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా వై ముఖ్య నేతల చెవిన పడింది. ఒకవేళ టీడీపీ గనుక తన కుమారుడి విషయంలో సానుకూలంగా స్పందించకపోతే, టీజీ వెంకటేష్‌ వైసీపీలోకి వెళ్ళిపోవడం ఖాయమేనన్నది కర్నూలు జిల్లాలో చర్చలు మొదలైయినట్టు తెలుస్తుంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat