తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరం గచ్చిబౌలిలోని కొతగూడలో బొటానికల్ గార్డెన్ లోని 12 ఎకరాల పార్కును ప్రారంభించారు .ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమ స్పూర్తిగా తీసుకోవాలన్నారు . దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని, ఇటీవల అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ప్లేయర్లు మాస్కులు కట్టికుని ఆడారని తెలిపారు.ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకుండా చేస్తామన్నారు. కాలుష్యం రాకుండా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన కేటీఆర్.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్ అన్నారు.
MA&UD Minister @KTRTRS addressing the gathering after inaugurating new facilities at Botanical Garden, Kothaguda. pic.twitter.com/KOIygB1oG7
— Min IT, Telangana (@MinIT_Telangana) July 11, 2018
గడిచిన నాలుగు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చిందన్నారు. పర్యావరణాన్ని కాపాడే హక్కు ప్రతి ఒక్కరిది అన్నారు. హరితహారం వచ్చే ఎన్నికల క్రమంలో ప్రచారం చేసేది కాదని, ఓ మంచి పని చేసేందుకు సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.తెలంగాణకు హరిత హారం కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి కేటీ ఆర్ సూచించారు.మొక్కలు నతడమే కాకుండా పెట్టిన మొక్కల్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని పేర్కొన్నారు.
Forest Minister Jogu Ramanna & MA&UD Minister @KTRTRS inaugurated new facilities at Botanical Garden, Kothaguda. MPs @VishweshwarRed1, MP Ponguleti Srinivasa Reddy, MLA @GandhiArekapudi, TSFDC Chairman Banda Narender Reddy & TSFDC VC & MD Chandan Mitra participated in the program pic.twitter.com/h1296lK31m
— Min IT, Telangana (@MinIT_Telangana) July 11, 2018