ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది..ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.అప్పటి ఉమ్మడి ఏపీ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పని చేసిన మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీలో చేరారు.ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరారు.ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహీదర్ రెడ్డికి వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు ..
