Home / SLIDER / ప్రతీ ఇంజనీర్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలి

ప్రతీ ఇంజనీర్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలి

ప్రతీ ఇంజనీర్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్ర ఇంజనీర్లకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జలసౌధలో ఇంజనీర్స్ డే సందర్భంగా ఇవాళ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ విగ్రహానికి పూల మాల వేసి మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు.ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురయిన వైతాళికుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ అని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు, అద్బుత కట్టడాల రూపకర్త నవాబ్ అలీ నవాజ్ జంగ్ అని కొనియాడారు.

రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే నవాజ్ జంగ్ జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా ప్రకటించుకున్నామని చెప్పారు. ఆ రోజుల్లో సాంకేతిక ప్రగతి లేకున్నా.. నవాజ్ జంగ్ అద్బుతంగా నిజాం సాగర్ ప్రాజెక్టును నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్టే ఆ రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని చెప్పారు. ఇప్పుడున్న సౌకర్యాలు లేకున్నా…. గుర్రాలపై అక్కడి వెళ్లి , స్వంతకు కుటుంబాలకు దూరంగా ఉంటూ. కేవలం టెంట్లలోనే నివసిస్తూ.. ఆ ప్రాజెక్టును అప్పటి ఇంజనీర్లు పూర్తి చేశారని చెప్పారు. ఆయన ప్రాజెక్టులు, కట్టడాలు వంటి వాటికి ఎన్నో రూపకల్పన చేసి, నిర్మించి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు సమాంతరంగా గొప్ప కీర్తిని గడించారని పొగిడారు. అదే స్ఫూర్తిని రాష్ట్రం వ చ్చాక విద్యుత్ శాఖ ఇంజనీర్లు, మిషన్ కాకతీయ, సాగు నీటి శాఖ ఇంజనీర్లు, ఆర్ అండ్ బి ఇంజనీర్లు, పంచాయతీ ఇంజనీర్లు, అహర్నిశలు పని చేస్తూ… రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పారు. తమ శాఖలో డిజైన్ ఇంజనీర్లు, జెన్కో ఇంజనీర్లు రూపకల్పన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చూసి సీడబ్ల్యూసీ ఇంజనీర్లు అబ్బురపడుతున్నారని చెప్పారు. ప్రతీ ప్రాజెక్టులోను మహిళా ఇంజనీర్లు రాత్రింబవళ్లు పని చేస్తూ…తమ ఇంజనీరింగ్ ప్రతిభను చాటుతున్నారన్నారు. రాత్రి 11 న్నర గంటలకు సైతం మహిళా ఇంజనీర్లు ప్రాజెక్టు పనుల్లో నిమగ్నయి ఉండటం గొప్ప విషయమన్నారు.

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద పరిస్థితిని రాత్రి 12 , ఒంటి గంట మధ్య వాట్సప్ ద్వారా అడిగితే… కూడా… ఇంజనీర్లు ఆ సమయంలోను అక్కడి తాజా పరిస్థితిని ఫోటోలు పంపుతున్నారని చెప్పారు. రాత్రిబంగళ్లు ఇంజనీర్లు చక్కటి నీటి యాజమాన్య పద్ధతిని నిర్వహిస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు ఒక టీఎంసీతో ఆరు వేల ఎకరాలకు నీరు ఇవ్వడమే గఘనం అయితే… మన ఇంజనీర్లు సమర్థవంతంగా నిజాం సాగర్ కింద ఒక టీఎంసీతో 13 వేలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాలకు, ఎస్సా రెస్పీ పోచంపాడు కింద ఒక టీఎంసీతో 11 వేల 500 ఎకరాలకు నీరివ్వడం అభినందనీయమన్నారు. అన్ అండ్ ఆఫ్ పద్ధతి, టెల్ టూ హెచ్ పద్ధతులను అవలంభించి మన ఇంజనీర్లు ఈ ఘనతను సాధించారని చెప్పారు. ఇది ఓ రికార్డేనన్న ఆయన… ఒకప్పుడు ఇంజనీర్లు అంటే ప్రాజెక్టుల కట్టే వారు మాత్రమ్నని.. కాని మన ఇంజనీర్లు భూసేకరణ వంటి పనులు, ఇతర శాఖల సమన్వయ పనులు సైతం నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రతీ ఇంజనీర్ పడే శ్రమను నేను ప్రాజెక్టులు సందర్శించినపుడు గుర్తించానని చెప్పారు. ఇంజనీర్స్ డే సందర్భంగా.. రాష్ట్ర ప్రగతికి పునరంకితం కావాలని ,ప్రతీ ఇంజనీర్ కు పిలుపునిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat