టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రతీ నాయకుడి పాత్రల్లో కూడా ఒదిగిపోగలను అని నిరూపించుకున్న కథా నాయకుల్లో గోపీచంద్ ఒకరు. తొలి వలపు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ జయం, నిజం చిత్రాల్లో తనలోని విలనిజం చూపించి సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే, 25 ఏళ్ల క్రితమే టాలీవుడ్‌కు పరిచయమైన గోపీచంద్‌ను ఇటీవల కాలంలో వరుస ప్లాపులు వెంటాడుతున్నాయి. గౌతమ్ సౌఖ్యం, జిల్, నంద, ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్ చిత్రాలతో వరుసగా ప్లాప్‌లు పలుకరించాయి.
ఇలా వరుసగా ప్లాప్‌లతో సతమతమవుతున్న గోపీచంద్‌కు పంతం కాస్త రిలీప్ ఇచ్చిందని, సినిమాపై మిశ్రమస్పందన వచ్చినప్పటికీ..ఆ ప్రభావం వసూళ్లపై పడలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండున్నర గంటలపాటు సినీ ప్రేక్షకుడికి వినోదాన్నిపంచడంలో గోపీచంద్ సక్కెస్ అయ్యాడని, దీంతో పంతం చిత్రం వసూళ్లు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, ఇప్పటి వరకు పంతం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.10.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయగా, ఈ వసూళ్లలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ 6.77 కోట్లు వరకు ఉండనుంది.