ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న.. ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యల పరిష్కరించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో తాము కూడా అంటూ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తమకు రుణమాఫీ చేస్తానని.. తమ చేత ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదని డ్వాక్రా సంఘాలు, రైతులు తమ ఆవేదను జగన్కు చెప్పుకుంటున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన చంద్రబాబు తీమనుమోసం చేశారని నిరుద్యోగులు సైతం జగన్కు తెలియజేశారు. ఇలా ఒక్కొక్కరుగా చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు అర్జీల ద్వారా తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న జగన్కు ప్రభుత్వ అధికారులు సైతం జై కొడుతున్నారు. అందులో భాగంగా జగన్తో కలిసి పాదయాత్రలో నడిచామని తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో చెప్పుకునేందుకు ఆధారంగా జగన్తో సెల్ఫీలు దిగుతున్నారు. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా సెక్యూరిటీలో భాగంగా వచ్చిన పోలీసు బాసులు సైతం సెల్ఫీల కోసం పోటీపడుతున్నారు.