ఏపీలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి కూడా వలసలు పర్వం కొనసాగుతుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సారి నవ్యాంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్త ఊపు వచ్చింది. నిన్న మొన్నటి వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విడివాడ రామ చంద్రరావు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.పవన్ కళ్యాణ్ ఆయనకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు ..