జంటనగరాల్లో బోనాలు వేడుకలు సజావుగా జరిపేల ఏర్పాట్లు జరుపుతున్నామని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బోనాలు ఏర్పాట్ల పై మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గం పరిధిలోని 160 మందికి పైగా ఆలయాల నిర్వాహకులు, కార్పోరేటర్లు , అన్ని విభాగాల అధికారులు నామాలగుండు లో జరిగిన ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ..జూలై 29వ తేదిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన తరువాత వచ్చే ఆదివారం సికింద్రాబాద్ అసెంబ్లి నియోజకవర్గం పరిధిలో ఈ చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయం చిలకలగుడలో ఆగష్టు 5 తేధీన బోనాలు, 6వ తేదీన రంగం వేడుకలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారిగా 2015 సంవత్సరంలో ప్రత్యేకంగా ఆలయాలకు నిధులు మంజూరు చేసే పద్దతిని ప్రవేశపెట్టాం. ఈ సంవత్సరం కూడా అన్ని దేవాలయాలకు నిధులను అందించేలా కృషి చేస్తాం. అయితే ఆయా నిర్వాహకులు విధిగా తమ దరఖాస్తు పత్రాలు, అధర్ కార్డు జెరాక్స్ , ఆలయం ఫోటో, గత సంవత్సర పొందిన నిధుల సద్వినియోగం సర్టిఫికేట్ వెంటనే అందించి సహకరించాలి. నిధుల కొరతతో సంబంధం లేకుండా భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు పక్కగా చేయాలని అధికారులను మంత్రి పద్మారావు ఆదేశించారు.
పార్టీలు,రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ సహకరించాలి. పండుగ రోజుల్లో పరిశుభ్రత, రోడ్ల మరమ్మతులు, స్ట్రీట్ లైట్, మంచి నీటి సరఫరా వంటి ఏర్పాట్లలో లోపాలు వుండకుండా జాగ్రతలు పాటించాలి. కరెంట్ సరఫరాలో ఇబ్బంది లేకుండా మొబైల్ జెనరేటలు సిద్దంగా వుంచుకోవాలి. వరుసగా రెండు రోజులు మంచి నీటిని సరఫరా చేయాలి. ఆలయాల వద్ద రద్దీ దృష్ట్యా పోలీసులు తగిన భద్రత యేర్పాట్లు చేయాలి. సిసి కెమెరాలు వినియోగించాలి. క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. బోనాలతో వచ్చేవాళ్ళకి విడిగా క్యూ లైన్ ఏర్పాటు చేయాలి. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడకుండా జాగ్రతలు తీసుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, తను కూడా సీతాఫల్ మండి లోని తన కార్యాలయంలో అందుబాటులో ఉంటానని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.