బుల్లితెర ప్రోగ్రామ్ జబర్దస్త్ పుణ్యమా అని అతి తక్కువ కాలంలో సెలబ్రెటీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది యాంకర్ కమ్ నటి రేష్మీ గౌతమ్. అనసూయ, శ్రీముఖి వంటి యువ యాంకర్లున్నా కానీ కుర్రకారు మతిపోగొట్టేలా గుంటూర్ టాకీస్ చిత్రంతో వెండి తెరపై అందాల ప్రదర్శన చేస్తూ , అదిరిపోయే లుక్స్ ఇస్తూ అందరిచేత హాట్.. హాట్ యాంకర్ అని అనిపించుకుంటోంది రేష్మీ గౌతమ్. గుంటూరు టాకీస్ ముందు, ఆ తరువాత అనేంతలా రష్మ ఇమేజ్ పెరిగిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
అంతేకాకుండా, ఇటీవల సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఫోర్న్‌స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన జీఎస్టీ వెబ్ సిరీస్ ఎంత వివాదస్పదమైందో అందరికి తెలిసిందే. అయితే, జీఎస్టీ సీక్వెల్‌లో రష్మీ నటించబోతోందంటూ వదంతులు దావానంలా వ్యాపించాయి. అవన్ని వట్టి పుకార్లేనని రష్మీ కొట్టిపారేసింది.
ఇదిలా ఉండగా, రేష్మీ గౌతమ్ మరో సారి వెండితెరపై తన అందాల ప్రదర్శనకు రెడీ అయింది. అంతకు మించి అనే టైటిల్‌తో ప్రముఖ దర్శకుడు జానీ తెరకెక్కిస్తున్న చిత్రంలో రేష్మీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను సెన్షేషన్ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. అంతకు మించి ట్రైలర్ తనను ఇంప్రెస్ చేసిందని, రష్మీ నటన చాలా అద్భుతంగా ఉందన్నారు. త్వరలో ఈ అంతకు మించి రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.