Home / ANDHRAPRADESH / టీడీపీ భయంతోనే కర్నూలులో ఎంపీగా బుట్టా రేణుకను ..ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని పోటికి

టీడీపీ భయంతోనే కర్నూలులో ఎంపీగా బుట్టా రేణుకను ..ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని పోటికి

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించడం, వారిని గెలిపించాలని పార్టీ నేతలను కోరడం సిగ్గుచేటని వైసీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో సొంత నాయకత్వంపై నేతలు నమ్మకం కోల్పోయారని అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో రామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

వైసీపీ నుంచి ఫిరాయించిన వారికి సీట్లను కేటాయింపు చేయడంతో టీడీపీ డొల్లతనం బయటపడిందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని ఎంపీగా బుట్టా రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించింది వైసీపీ అభిమానులు. మరి అలాంటిది మళ్లి వారికే టీడీపీ టిక్కెట్లు ఇవ్వడం ఏమీటి అని ..అంటే టీడీపీలో వైసీపీకే పోటికి దిగే బలమైన నాయకులు లేరు అని స్ఫష్టంగా తెలుస్తుంది అన్నారు. ఇప్పటికే రాజకీయ వ్యభిచారం చేస్తున్న సీఎం చంద్రబాబు బాటలోనే లోకేష్‌ రాజకీయ ప్రయాణం సాగుతుందనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమని అన్నారు. వైసీపీ ప్రొడక్టులపై టీడీపీ అధినాయకత్వం బాగానే మమకారం పెంచుకున్నట్లు ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఫిరాయింపుదారులను టీడీపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదని చెప్పారు.

BY Ramaiah Slams Nara Lokesh In Kurnool - Sakshi

కర్నూలులో 14 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను వైసీపీ గెలవబోతోందని పేర్కొన్నారు. జిల్లాను ఐటీ హబ్‌గా మారుస్తానని బీరాలు పలికిన లోకేష్‌ ఆ దిశగా ఒక్క అడుగైనా వేశారా? అని ప్రశ్నించారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులు ఉన్నా వారికి ఐటీ ఉద్యోగాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రిబ్బన్‌ కటింగ్‌లు, శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది. కర్నూలు జిల్లాకు అయితే నాలుగేళ్లుగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నిధులను కేటాయించలేదని ఆరోపించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే వన్‌ కంట్రీ-వన్‌ ఎలక్షన్‌ (జమిలీ ఎన్నికలు)కు టీడీపీ భయపడుతోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat