ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన కూతురు బరిలోకి దిగుతుంది అని గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది..ఆ తర్వాత ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇటివల టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ఒక సైతాను లా దపరించారు అని ఆయన ఫైర్ అయ్యారు .కేసుల నుండి తనని తానూ రక్షించుకోవడానికి పాదయాత్ర చేస్తున్నాడు అని జలీల్ ఖాన్ జగన్ పై ఫైర్ అయ్యారు .టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే జగన్ మీద నా కూతురు ,బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీద పోటి చేసి గెలుస్తాం అని ఆయన అన్నారు ..