వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, వైఎస్ జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం తూర్పు గోదావరిలో 210వ రోజు కొనసాగుతోంది. తమ సమస్యలను తెలుసుకునే క్రమంలో పాదయాత్ర చేస్తున్నజగన్ వెంట తాము కూడా అంటూ ప్రజలు అశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. చంద్రబాబు సర్కార్ పాలనలో అన్ని విధాలా నష్టపోతున్నాని, అధికార పార్టీ కార్యకర్తల నుంచి..నేతల వరకు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ ప్రజలు జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను సామరస్యంగా వింటూ.. పరిష్కార మార్గాలను ఆన్వేషిస్తూ.. ప్రజల్లో భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇదిలా ఉండగా, సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ తృటిలో కిందపడబోయాడు. అయితే, జగన్ పాదయాత్లరో అశేష సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది జగన్ కిందపడకుండా పట్టుకున్నారు. అయితే, పాదయాత్ర చేస్తున్న జగన్‌కు చాలా చోట్ల ఇటువంటి ఘటనలు ఎదురయ్యాయి. అయినా, జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా తన పాదయాత్రను కొనసాగిస్తుండటం గమనార్హం.