ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తూర్పు గోదావరి మండపేట నియోజకవర్గంలో రాయవరం నుండి రెండు వందల పదో రోజు జగన్ పాదయాత్ర చేయాల్సి ఉంది.నిన్న సోమవారం సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగన్ పాదయాత్రకు బ్రేక్ పడింది.ఇప్పటివరకు జగన్ మొత్తం రెండు వేల ఐదు వందల పదహారు కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేశారు ..
