వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడంలో వైఎస్ జగన్ పీహెచ్‌డీ చేశారని, నాడు కాంగ్రెస్ అధిష్టానానికి, నేడు బీజేపీ అధిష్టానానికి మోకరిల్లిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌కే చెల్లుతుందన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వద్ద జగన్ మోకరిల్లితేనే.. తనపై ఉన్న కేసులన్నీ ఒక్కొక్కటిగా మాఫీ అవుతున్నాయని విమర్శించారు.
కాగా, టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఏపీని అభివృద్ది పథంలో నడిపిస్తున్న టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులపై వైఎస్ జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. అందులోనూ.. మంత్రి యనమల రామకృష్ణుడును దద్దమ్మ అని సంబోధించడం రోజా అహంకారానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసేది ప్రజల కోసం కాదని.. కేవలం సీఎం కుర్చీ కోసమేనని ఎమ్మెల్యే అనిత దుయ్యబట్టారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యర్థ ప్రేలాపణలు మానుకుని తన గౌరవాన్ని నిలుపుకోవాలని హితవుపలికారు టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత.