మనం నిద్రించే సమయంలో.. పొరపాటున ఉత్తరం వైపున తలపెట్టి నిద్రిస్తే.. ఆ వెంటనే.. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదు అంటూ మన పెద్దలు చెప్పడం వింటుంటాం. ఆ నేపథ్యంలోనే ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు..? అన్న సందేహం ప్రతీ ఒక్కరికి రావొచ్చు. అలా ఆ ప్రశ్నకు ఇంకా సమాధానం తెలియని వాళ్లకు మన పూర్వీకులు, శాస్ర్తవేత్తలు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకుందాం..!
ఇక అసలు విషయానికొస్తే.. ఉత్తరం వైపు తలపెట్టి కనీసం జంతువులు కూడా నిద్రించవట. కావాలంటే జంతు ప్రదర్శనశాలకు వెళ్లి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న తరువాత భూమిపై అన్ని విషయాలు తెలుసుకున్న మనిషి ఎందుకు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తాడు. అస్సలు చేయడు. అయితే, భూమికి ఉత్తర ధృవం, దక్షిణ ధృవం ఉన్న విషయం తెలిసిందే. వీటి రెండిటి మధ్య కొద్దిగా భూమి లోనికి నొక్కబడి ఉంటుంది. ఈ క్రమంలోనే భూమి తన చుట్టూ తాను సవ్య దిశలో తిరుగుతుండగా.. భూమి లోపల ఉండేటటువంటి అంతర్బాగ గోళం మాత్రం అపసవ్య దిశలో పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే, 2 లక్షలా 87 వేల మైళ్ల దూరంలో భూమి అంతర్భాగ గోళం ఉందని శాస్ర్తవేత్తలు చెప్పిన విషయం తెలిసిందే. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం ఆకర్షణలతోనే మానవుడు భూమికి అంటిపెట్టుకుని ఉంటాడని పూర్వికుల మాట. అంతేకాకుండా, ఈ రెండింటిలో కూడా ఉత్తర ధృవానికే ఎక్కువగా ఆకర్షణ శక్తి ఉంటుందట. ఈ క్రమంలో మానవుడు ఉత్తరం వైపు పడుకుని నిద్రిస్తే, ప్రయాణిస్తే, త్వరగా తనలోని శక్తిని కోల్పోయి మానసిక, శారీరక బలహీనతలను పొందుతాడు. అంతేకాకుండా, వృద్ధాప్యం కూడా త్వరగా వస్తుందన్నది పూర్వీకుల మాట.