Home / POLITICS / కువిమ‌ర్శ‌లు కాదు..ద‌మ్ముంటే కేటీఆర్ స‌వాలుకు స్పందించండి

కువిమ‌ర్శ‌లు కాదు..ద‌మ్ముంటే కేటీఆర్ స‌వాలుకు స్పందించండి

కాంగ్రెస్‌ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 42ఏండ్లు పరిపాలించి పేదవర్గాలను అణచివేసిన పాపాన్ని మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదన్నారు.  ప్రజల మధ్యకు వెళ్లే ధైర్యం లేక నిత్యం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.  రూ.200 పెన్షన్‌ ఇచ్చిన వైఎస్‌ఆర్‌లో గొప్పనేతను చూస్తున్న కాంగ్రెస్‌ కండ్లు , రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.1000కి, రూ.500 ఉన్న పెన్షన్‌ను రూ.1500కు పెంచి అర్హులైన లబ్ధిదారులందకీ క్రమంగా తప్పకుండా పంపిణీ చేస్తున్న సీఎం కేసీఆర్‌లో గొప్పనేతను చూడటం లేదంటే వారు ఎంత కుట్రపూరితంగా మారిపోయారో అర్ధమవుతున్నదన్నారు.

పెళ్లి సందర్భంగా రూ.25వేలు ఇస్తామని చెప్పి జుమ్మేరాత్‌ బజారులో పాతసామాన్లు కొనిచ్చి రూ. పదివేల చొప్పున దోచుకున్న కాంగ్రెస్‌ నాయకులది మంచి పాలనో, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా రూ.ఒకలక్షా 116  చొప్పున ఇస్తూ  ప్రతి పేద ఇంట్లో ఆడబిడ్డల పెళ్లిని వారికి భారం కాకుండా జరిపిస్తున్న కేసీఆర్‌ పాలన మంచిదో ప్రజలకు తెలుసని రాములు నాయ‌క్ అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావులు ప్రత్యేక  శ్రద్ద  పెట్టి పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాక ఆరు లక్షల ఎకరాలకు నీరిచ్చి వలసలు వాపస్‌ వచ్చేలా చేసిన  ప్రభుత్వాన్ని విమర్శిస్తూ… 42 ఏండ్లు పాలించి కేవలం 50వేల  ఎకరాలకు మాత్రమే నీరిచ్చి 20లక్షల మంది వలస వెళ్లాల్సిన గతి పట్టించిన కాంగ్రెస్‌ పాలన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ వంటి వారికి అద్భుత పాలనగా కనిపించడం సిగ్గు చేటు అని రాములు నాయక్‌ దుయ్యబట్టారు. ప్రాజెక్టులలో అవినీతి వరద పారించారని, మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల పేరుతో వేల కోట్లు దోచుకొని దాచుకున్నారని, అసలు కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అవినీతికి అడ్డా అని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఆ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు తెలుసునని ఆయన నిప్పులు చెరిగారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, దీనిని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వీకరించాలని మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరించే దమ్మూధైర్యం లేని పార్టీ కాంగ్రెస్‌ అని రాములు నాయ‌క్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబరు వన్‌ రాష్ట్రంగా నిలిచిందని, కేసీఆర్‌ పాలనను ప్రధాని మొదలు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు అభినందిస్తుంటే ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులు మాత్రం విషం కక్కుతున్నారన్నారు. రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ కాకతీయ, మిషన్‌భగీరధ, గురుకుల పాఠశాలలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌,  డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు, 24గంటల నిరంతర విద్యుత్‌, కుల వృత్తును నిలబెట్టే పథకాలు అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండగా  ఈ నిజాలను చూడలేని కాంగ్రెస్‌ నాయకులు కండ్లుండి చూడలేని కబోదులు అని రాములునాయక్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని పదేపదే విమర్శిస్తున్న ఇదే కాంగ్రెస్‌ నాయకులు తరతరాలుగా గాంధీ కుటుంబం చేతిలో బానిసలుగా బతుకుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా గుణపాఠం నేర్పుతారన్నారు. ప్రజల అభిమానం పొందలేక గాంధీభవన్‌కు తాళాలు వేసుకొని ఢిల్లీకో, మరే ఇతర రాష్ట్రానికో పారిపోయి బతకాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ నాయకులకు వస్తుందని రాములునాయక్‌ హెచ్చరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat