వాదస్పద చర్యలతో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తున్న కత్తి మహేష్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయం పై హైదరాబాద్ పాతబస్తీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు . మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న కత్తికి ఆరు నెలల నిషేధం సరిపోదని, అతణ్ని జీవితాంతం హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకోవాలని రాజాసింగ్ సంచలన వాఖ్యలు చేశారు.రాజాసింగ్, మరో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లు ఈ రోజు గృహనిర్బంధంలో ఉన్న స్వామి పరిపూర్ణానంద స్వామిని కలిసేందుకు వచ్చి విలేకర్లతో మాట్లాడారు. కత్తికి భావప్రకటన స్వేచ్ఛ ఉన్నట్టే, పరిపూర్ణానంద స్వామికి కూడా ఉందని, ఆయనను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచడం సరికాదని అన్నారు. తాము పరిపూర్ణానందను కలుసుకోవడానికి పోలీసులు అనుమతివ్వకపోవడం దారుణమన్నారు.
