ప్రస్తుతం దేశమంతటా ఒకటే చర్చ జమిలీ ఎన్నికలు.అందులో భాగంగా నిన్ననే దేశంలో ఉన్న పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో జాతీయ లా కమీషన్ సమావేశమైంది.ఈ సమావేశంలో కొన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రం నో చెప్పాయి.
మరికొన్ని పార్టీలు మాత్రం ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.ఈ క్రమంలో జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేదిలు ఖరారు అయినట్లు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా,అటు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం ముందుకొచ్చింది.
అందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా సై అన్నది.అందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నెలలొ 3వ తేదీ నుండి 8వ తేదీ లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అనంతరం అదే నెల అంటేడిసెంబర్ 21వ తేదీ నుండి 28 తేదీ లోపు ఎన్నికలు ఉండవచ్చు అని ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఎన్నికల కమీషనే తెల్చాలి..