ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర నేటితో 209వ రోజుకు చేరుకోగా ఆదివారంతో 2500 కిలోమీటర్ల మైలురాయి దాటిని విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం లేదు. వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ముందడుగు వేస్తున్నారు. కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి తానున్నానంటూ జగన్ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే, జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని గుడివాడలో ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి అయిన 72 గంటల్లోనే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏపీలో చంద్రబాబు సర్కార్ ఉన్నంత వరకు పేదల సమస్యలు పరిష్కారానికి నోచుకోవనే విషయం ఇప్పటికే రుజువైందన్నారు. సీఎం కార్యాలయంలో మూలన పడి ఉన్న ఫైళ్లే అందుకు నిదర్శనమన్నారు.
అయితే, వైసీపీ అధికారంలోకివస్తేనే ప్రజల సమస్యల ఫైళ్లన్నీముందుకు కదులుతాయని, సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ సత్వర పరిష్కారం చూపుతారన్నారు. అందులో భాగంగానే ఇటీవల జగన్ ఇచ్చిన హామీని ఎమ్మెల్యే కొడాలి నాని గుర్తు చేశారు. అదే.. గ్రామాల్లో సచివాలయాల ఏర్పాటు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా గ్రామ పరిధిలోని అధికారులకు తెలియజేస్తే.. గ్రామ ప్రభుత్వ అధికారులు ఆ అర్జీలను రెవెన్యూ అధికారులకు, రెవెన్యూ అధికారులు జిల్లా అధికారులకు, వారు జిల్లా కలెక్టర్‌కు, అక్కడ్నుంచి సీఎంఓ కార్యాలయానికి ఇలా .. గ్రామంలో అందిన అర్జీలను ముఖ్యమంత్రి కార్యాలయానికి చేర్చేలోపల సుమారురెండు సంవత్సరాలు పడుతుందని, అయితే, జగన్ తీసుకున్న గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఎంత పెద్ద సమస్య అయినా కేవలం 72 గంటల్లో పరిష్కారమవుతుందని తెలిపారు.