వారానికి ఒక్క సారైనా ఇంటి ప్రధాన ద్వారం గడపకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీ ప్రదం. దుష్టశక్తులు ఇంట్లోకి రావు. శుక్రవారం లేదా గురువారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాస్తే ఎంతో మంచిది. శుక్రవరాం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపపైన నల్లటి తాడుతో పటిక కడితే దుష్ట శక్తులు, దృష్టి దోషం కూడా తొలగిపోతుంది. పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం ఇంటికి సౌభాగ్యాన్ని ఇస్తాయి. అలాగే, ఇంట్లో వారానికి ఒక్కసారి శుక్రవారం పూట లేదంటే శని, గురువారాల్లో తప్పకుండా దీపారాధన చేయాలి. ప్రతీ రోజూ దీపారాధన చేస్తే చాలా మంచిది.
పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. స్నానం చేయకుండా, అపరిశుభ్రమైన దుస్తులతో, కాళ్లు కడుక్కోకుండా పూజ గదిలోకి వెళ్లకూడదు. దేవుళ్ల ప్రతిమలను తాకరాదు. దీపారాధన చేసిన తరువాతనే దేవుళ్ల ప్రతిమలకు, పటాలకు పూలు అలంకరించాలి. పూజ గది ఎంత కళకళలాడితే ..అంతగా మనజీవితాలు కళకళలాడుతాయని పండితులు చెబుతున్నారు. వీలైనంత వరకు రెండు లేదా మూడు పటాలను మాత్రమే. పూజ గదిలో ఉంచాలి. ఇంటి గడపకు పసుపు రాస్తే సైన్స్ ప్రకారం యాంటి బయోటిక్‌గా పనిచేస్తుందని, దీని వల్ల బయటి క్రీములు లోపలికి రాకుండా ఉంటాయి. ఇంటికి మామిడి తోరణాలు కట్టడం వల్ల మనంవదిలే కార్బన్‌డయాక్సైడ్‌ను తీసుకుని ఆక్సీజన్‌ను వదులుతాయి. ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు.