నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు అందుకు సహకరించడంలేదా ..గత నాలుగు ఏళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ప్రజలు విసిగి చెంది టీడీపీ పార్టీని ఓడించాలనే కసితో ఉన్నారా ..అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.అందులో భాగంగా ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారిలో కొంతమందిని తప్పించి కొత్తవారిని
తీసుకోవాలని ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.ఇలా తొలగించేవారి జాబితాలో ఎంపీ మురళి మోహన్ పేరు ఉంది .
సదరు ఎంపీ గురించి,ఆయన పనితీరు గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుదఫాలుగా సర్వేలు చేయించారు.ఈ సర్వేలో మురళి మోహన్ ప్రజలకు దగ్గర ఉండడు ..పార్టీ నేతలను ,కార్యకర్తలను సమన్వయ పరచడంలో విఫలమయ్యాడు.నిధులు తీసుకురావడంలో కూడా ఆయన విజయంసాధించలేకపోయారు.ప్రస్తుతం ఎంపీగా ఉన్న మురళిని రానున్న ఎన్నికల్లో బరిలోకి దించితే గెలుపు కష్టమని ఆ సర్వేలలో తేలింది.సర్వేలను మొదటి నుండి నమ్మే చంద్రబాబు మురళి మోహన్ ను ఎంపీగాపంపేబదులు రాజ్యసభ సభ్యుడిగా పంపడం మేలని ఆయన ఆలోచించారు .
అందుకే వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పరిశ్రమికవేత్తకు కానీ ప్రస్తుతం బెంగుళూర్ లో ఉండి వ్యాపారాలు చేసుకుంటున్న ప్రముఖ కాంట్రాక్టర్,బీఎస్ఆర్ కనస్ట్రక్షన్ అధినేత బలుసు శ్రీనివాసరావు కి కానీ టికెట్ కన్ఫాం చేశారు అని తెలుగు తమ్ముళ్ళతో పాటుగా బాబు ఆస్థాన మీడియాగా ముద్రపడిన పచ్చ మీడియాలో వార్తలను ప్రసారం చేస్తున్నారు.సో పచ్చ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపీ మురళి మోహన్ కు సీటు దక్కదు అన్నమాట ..