ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి.ఈ జయంతి సందర్భంగా అయన అభిమానులు,వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతి వేడుకలు పత్తికొండ నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి.నియోజకవర్గం లోని వెల్దుర్తి పట్టణం నందు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పత్తికొండ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశంలోని ఏ రాష్ట్రమూ ఉచిత విద్యుత్ ఇవ్వలేదని, కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఉచిత విద్యుత్ తొలిసారిగా ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆవుల భారతి మరియు వైయస్సార్ పార్టీ నాయకులు సుబ్బారెడ్డి, అగస్టీన్, ఆవుల వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ పార్టీ వెల్దుర్తి టౌన్ ప్రెసిడెంట్ వెంకట నాయుడు మరియు వెల్దుర్తి మండల వైయస్ఆర్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
