మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా విజేత సినిమా రూపొందిన విషయం తెలిసిందే. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా.. సినిమా ప్రమోషన్స్‌ను కల్యాణ్ దేవ్ ఎప్పుడో మొదలు పెట్టేశాడు. కాగా, ఇటీవల ఓ సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా అనుభవాలను పంచుకున్నాడు.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తనలో టెన్షన్ పెరిగిపోతోందని, సినిమా గురించి ఆలోచిస్తుంటే నిద్ర కూడా పట్టడం లేదని తన కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కూడా సినిమా అవుట్‌పుట్‌పట్ల సంతృప్తికరంగా ఉన్నారని.. సంతోషంగా తెలిపారు. ఈ సినిమా చూసిన తరువాత పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా..? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తడ్రీ, కొడుకుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందంటూ కొణెదలవారి అల్లుడు ఆశాభావం వ్యక్తం చేశాడు.