Home / ANDHRAPRADESH / రెండే నిమిషాల్లో నీ అంతు చూస్తా-ఎమ్మార్వోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ..!

రెండే నిమిషాల్లో నీ అంతు చూస్తా-ఎమ్మార్వోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దాడులు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ అయిన కందికుంట తన వర్గీయులకు ,టీడీపీ వాళ్ళకు ,ఆ పార్టీ సానుభూతి పరులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలంటే ఎమ్మెల్యే చాంద్ భాషాను కలవమని ఎమ్మార్వో సూచించారు.

దీంతో కోపోద్రిక్తుడైన కందికుంట దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మార్వో అయిన పీవీ రమణను పట్టుకొని నోటికి వచ్చినట్లు బండ బూతులు తిట్టారు .ఆయన మాట్లాడుతూ నువ్వు నాకన్నా తక్కువగా చదువుకున్నావు .నిన్ను ఏసీబీకి పట్టించడం పెద్ద పనే ఏమి కాదు.నీ పతనం చూడటం నాకు రెండు నిమిషాల పని .

ఇంటి పట్టాలు ఇవ్వమంటే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళమంటావు .నాకు అనుకూలంగా ఉన్నాడని ఇక్కడున్న ఓ వీఆర్‌ఓను బదిలీ చేసి బ్రోకర్‌ను తెచ్చుకుంటావా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాపైన డెకాయిట్‌ కేసు నమోదైంది.. నీకు తెలీదేమో..’’ అంటూ కందికుంట తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.తహసీల్దార్‌ అది కాదు సార్‌ అనబోగా.. ‘‘ఏందివయ్యా.. మళ్లీ అది కాదంటావు.. ఇంగ నేను బూతులే మాట్లాడతా.. నువ్వు నోరు తెరిచావనుకో.. నేను చెయ్యి చేసుకోవాల్సి ఉంటుంది’’ అని బెదిరింపులకు దిగారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat