దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణ జన్ముడు, దేవుడు ఆదేశించిన పనులను సక్రమంగా నెరవేర్చి.. మళ్లీ దేవుడి దగ్గరకు వెళ్లారు. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆయన ఒక రోల్ మోడల్ అని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద విజయమ్మ నివాళులు అర్పించారు.
ఒక ప్రజానేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో రాజశేఖర్‌రెడ్డి చేసి చూపించారన్నారు. గ్రామాల్లోని చివరిస్థాయి పేదవారికి కూడా తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా.?? లేవా..? అని నిత్యం సమీక్షా సమావేశాలతో తెలుసుకునేవారని, ఆ సమీక్షలే ఆయన్ను ప్రజానేతగా చేశాయన్నారు.