తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో 1 30మంది అడ్వకెట్స్ ,పారిశుద్ధ్య కార్మికులు తెరాస పార్టీలో చేరారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల చరిత్ర గొప్పది.వారి సేవలు అమోఘం.ఉద్యమకారుల ఉద్యమ కేసుల విషయంలో చొరవ మరువలేనిది.బంగారు తెలంగాణ పునర్నిర్మాణం లో న్యాయవాదుల పాత్ర కీలకం.న్యాయవాదులకు 100కోట్లు నిధులు ఇచ్చిన ఏకైక సిఎం కేసీఆర్ గారే.న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి,న్యాయవాదులకు 10లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్,2లక్షలు ఆరోగ్య భీమా ఇస్తున్నాం.
మన మంచి సిద్దిపేట లో బార్ అసోసియేషన్ భాగస్వామ్యం అవసరం.ప్రత్యక్షంగా పార్టీలో కి రావడం ఆనందంగా ఉంది.మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న.సిద్దిపేట నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి ని సాధించాం.విద్యా ,వైద్యం , మౌలిక వసతుల కల్పనలో సిద్దిపేట ఆదర్శంగా నిలుపుతున్నాం.ప్రజా శ్రేయస్సుకు పాటుపడుతున్నాం.బార్ అసోసియేషన్ పూర్తిస్థాయిలో అన్నివిధాలా సహకారం అందిస్థా,జూనియర్ న్యాయవాదుల విషయంలో ఆలోచిద్దాం.న్యాయవాదుల డబుల్ బెడ్రూం , యువ న్యాయ వాదులకు స్టై ఫండ్ కి కూడా కృషి చేస్తాం.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం,పేదల పక్షాన తెరాస ప్రభుత్వం.ప్రతి ఆడపిల్ల పెళ్లిళ్లకు కళ్యణ లక్ష్మీ ద్వారా లక్షా నుటపదహర్లు ఇస్తున్నాం.పేద మహిళ డేలవరికి కేసీఆర్ కిట్ ద్వారా 12వేలు ఆర్థిక భరోసా ఇస్తున్నాం.ప్రభుత్వం ఆసుపత్రిలను మెరుగుపరిచాము.ప్రభుత్వం రెసిడెన్షియల్ లను కార్పోరేట్ స్థాయిలో విద్యతో పాటు సదుపాయాలనుఅందిస్తున్నాం.పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువ లేనివి.మీ సేవలు ప్రభుత్వం గుర్తిస్తుంది.సీఎం కేసీఆర్ ,ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టి కి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అని అన్నారు ..