1998 నుంచి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కోర్టు కష్టాలు తప్పడం లేదు. హిట్ అండ్ రన్ కేసులో చాలా సంవత్సరాల విచారణ అనంతరం ఆ కేసు నుంచి సల్మాన్‌కు ఊరట లభించింది. అయితే, 1998లో జరిగిన కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్‌కు జోద్‌పూర్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనేక నాటకీయ పరిణామాల మధ్య సల్లూభాయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆ వ్యవహారం సర్దుమణగకముందే.. సల్మాన్ మరోసారి కోర్టు మెట్లెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
ఓ స్థలం వివాదంలో సల్మాన్‌పై ఓ ఎన్నారై జంట లీగల్‌గా ప్రొసీడ్ అయ్యేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వారు ఈ విషయాలను వెల్లడించారు. సల్మాన్ ఖాన్‌కు చెందిన ఓ ఫామ్స్‌కు ఆనుకుని ఎన్నారై జంటకు కొద్దిగా స్థలం ఉంది. సల్మాన్‌కు చెందిన ఫామ్స్ గుండా.. ఆ స్థలాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. అందులోను ఆ ఎన్నారై జంట తమకు చెందిన స్థలంలో నిర్మాణం చేపట్టే క్రమంలో ఓ ఎలక్ర్టికల్ పోల్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అయితే, తమ స్థలంలో ఎలక్ట్రికల్ పోల్ ఏర్పాటును సల్మాన్ అనుచరులు అడ్డుకున్నారని తమ స్థలంలో వెళ్లేందుకు అడ్డుకుంటున్నారని ఎన్నారై జంట ఆరోపిస్తోంది. ఈ విషయాలన్నిటిని ఆ ఎన్నారై జంట మీడియా సమావేశంలో వెల్లడించింది. ఈ విషయంలో సల్మాన్‌కు లీగల్ నోటీసులు పంపినట్టు కూడా తెలుస్తోంది.