రానున్న మరో ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీలో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని అన్నారు.తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బీసీలకు మేలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. కాంగ్రెస్ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల బతుకంతా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళుమండి కేసులేస్తున్నారని, ఇక బీజేపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
Tags CM KCR MLA Srinivas Goud