తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట ఉపాధ్యాయ భవన్ లో జరుగుతున్న కానిస్టేబుల్ శిక్షణా శిబిరాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు… ఈ సందర్భంగా వారితో కాసేపు సూచనలు…సలహాలు… ఇస్తూ… ఆత్మీయంగా ముచ్చటించారు.. శిక్షణా తరగతుల నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు…
స్వయంగా విద్యార్థులని లేపి మాట్లాడించారు… కోచింగ్ బాగా ఇస్తున్నారా … ఎట్లా ఉందమ్మ… ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా… భోజనం ఎలా ఉంది… అని వారితో ఇంటరాక్ట్ అయ్యారు… మిలో ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి… మీ ఆత్మవిశ్వాసం తో వేసే అడుగులే మీ జీవితాల్లో వెలుగులు ..ఉద్యోగం కావాలి…
నేను జాబ్ కొట్టాలి అని ఒక కసి… పట్టుదల ఉండాలి… అని వారికి సూచనలు ఇచ్చారు…ఉద్యోగం తెచ్చుకొని శిక్షణా తీసుకోవడం కాదు… శిక్షణ కు సార్ధకత తీసుకరావాలి… అప్పుడో మాకు సంతోషం…త్వరలో విఆర్వో , గ్రూప్ 4 పోటీ పరీక్షలకు కూడా శిక్షణా ఇస్తామన్నారు…ఇలాంటి సద్వినియోగం చేసుకోవాలి అన్నారు…