దొడ్డిదారిన మంత్రివి అయిన నీవు.. మొదట నీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చెయ్.. నీ ప్రత్యర్థిగా జనసేన తరుపున ఒకరిని నిలబెడతా.. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. కాగా, ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు దేశంలోనే ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేశారన్నారు. అలాగే, అధికార పార్టీ నేతలు, మంత్రులు అవినీతికి పాల్పడుతున్నా సీఎం చంద్రబాబు ఒక్క మాట కూడా అనకపోవడం దారుణమన్నారు.
సీఎం చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్‌ను దొడ్డిదారిన మంత్రిని చేసినట్టు.. సీఎంను చేయాలని అనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇచ్చాపురం ఉంచి అనంతపురం వరకు ఉన్న ఏ సమస్యపైనైనా చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.