అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పటివరకు దాదాపు తొమ్మిదేళ్ళు నిరంకుశంగా పాలిస్తున్న ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అప్పటి పాలనకు పాదయాత్రతో శరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ..పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి మరల రెండో సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదో జయంతి నేడు.
మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి .ఈ క్రమంలో ఆయన తనయుడు ,నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి జయంతి సందర్భంగా ఇచ్చి ఘన నివాళులు ఏమిటో తెలుసా ..అదేమిటి అంటే అన్ని వర్గాల ప్రజలు ఆయన వెంటనడువగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని పులసపూడి వంతెన వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఈ మైలురాయికి గుర్తుగా అక్కడ ఒక మొక్కను నాటారు. అనంతరం జగన్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి రోజున ఈ మైలురాయి దాటడం విశేషం. నాన్న గారు ఎక్కడ ఉన్న కానీ ఆయన మన వెంటే ఉన్నారు .ఆయన ఆశీస్సుల వలనే ఈ మైలురాయిని దాటాను ..మీఅందరి ఆశీసులతో ..నాన్నగారి దీవెనలతో త్వరలోనే రాజన్న రాజ్యం తీసుకొస్తా ..మీ అందరి కష్టాలను తీరుస్తా అని ఆయన అన్నారు .