టాలీవుడ్లో అల్లు అరవింద్ అంటే వ్యక్తికాదు.. వ్యవస్థ అని ఎవరిని అడిగినా చెబుతారు. దీనికి కారణం సినీ ప్రపంచంలో దశాబ్దాల కాలంపాటు ఆయన నిర్మాతగా కొనసాగడమే. ఆయన మాటకు టాలీవుడ్లో ఎంతో విలువ ఉంటుంది. తెలుగు చిత్ర సీమలో ప్రస్తుతం ఉన్న పెద్ద మనుషుల్లో ఒకరిగా అల్లు అరవింద్‌కు పేరు ప్రతిష్టలు ఉన్న విషయం తెలిసిందే.
అసలు చిరంజీవి మెగాస్టార్ అయ్యేంత చరీష్మా సంపాదించుకోవడం వెనుక అల్లు అరవింద్ హస్తముందంటే ఎవరూ కాదనలేని నిజం. చిరంజీవి సినిమాలకు ప్లస్ కావడమే కాదు.. హిట్ లు అవసరమైన ప్రతీ సారి తన సొంత బ్యానర్లో సినిమాలు తీస్తూ బావ క్షేమాన్ని కోరుకుంటారు అల్లు అరవింద్. అలాంటి అరవింద్‌కు ఇటీవల కాలంలో మెగా హీరోలు వార్నింగ్‌లు ఇస్తున్నారట.
అరవింద్ వయసులోను, వ్యక్తిత్వంలోనూ పెద్దవాడు కాబట్టి తనకంటే చిన్నవారైన కుటుంబ సభ్యులను అరే. ఒరే అని పిలవడం కామన్. అయితే, కొందరు మెగా హీరోలు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారట. ఇప్పుడు తమకు స్టార్ హీరో ఇమేజ్ ఉందని, పబ్లిక్ ప్లేస్‌లలో అరే.. ఒరే అని పిలిస్తే బాగుండని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.