తెలంగాణ ప్రభుత్వం ఓ చారిత్రక ఘట్టానికి పూనుకున్నది. సీఎం కెసిఆర్ చొరవతో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వైద్య ఆరోగ్యశాఖలో ఒకే సారి భారీగా పోస్టుల నియామకాలు జరిగాయి. దీంతో తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వాళ్ళకు ధీటైన జవాబు లభించింది. తెలంగాణలో జాబుల జాతర కొనసాగుతున్నది. దానికి కొనసాగింపుగా వైద్య ఆరోగ్యశాఖలో అనేక పోస్టులకు నోటిఫికేషన్లు పడ్డాయి.
తాజాగా వైద్య ఆరోగ్య చరిత్రలో మొట్ట మొదటి సారిగా 919 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల స్పషాలిటీ పోస్టులు భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషాలిటీ పోస్టులు రావడం కూడా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో గ్రామీణులకు కూడా స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుంది. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక వైద్య ఆరోగ్యశాఖలో ఇంత భారీ స్థాయి పోస్టులు ఇదే తొలిసారి కాగా, ఇప్పటికే పెరిగిన ఓపీ, ఐపీలకు అనుగుణంగా వైద్యుల నియామకాలు జరిగాయి.
దీంతో ఇప్పటి దాకా భారంగా పని చేస్తున్న వైద్యులకు ఊరట లభిస్తుంది. అలాగే కెసిఆర్ కిట్ల పథకం ప్రసవాలకు తోడ్పాటుగా నియామకాలు ఉండున్నాయి. ఇదిలావుండగా, సిఎం కెసిఆర్ చొరవతో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు పూర్తయ్యాయని, సిఎం కెసిఆర్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. ప్రజల అవసరాలను గుర్తించి అనుమతిచ్చిన ముఖ్యమంత్రి మనసున్న మారాజని మంత్రి కొనియాడారు. నియామకాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసిన అధికారులకు మంత్రి ప్రశంసించారు.