శ్రియా భూపాల్, ఆనందిత్ రెడ్డి వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోగల నోవాటెల్ హోటల్ లో శుక్రవారం అతిరథ మహారధు సమక్షంలో వీరిద్దరూ పెళ్లిబంధం ద్వారా ఒక్కటయ్యారు. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన సంగీత్ ఉత్సవంలో ఇప్పటికే పలువురు తారలు, సెలబ్రెటీలు సందడి చేశారు. విరాట్ కోహ్లీ – అనుష్కశర్మ, నాగచైతన్య – సామ్‌ల పెళ్లిల్లో అద్భుత మైన ఫోటోలు తీసిన సోసఫ్ రాథిక్ శ్రియా, ఆనందిత్ రెడ్డి పెళ్లికి ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
తాజాగా ఆయన శ్రియా, ఆనందిత్ రెడ్డి వివాహానికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేశారు. స్వతహాగా ప్యాషన్ డిజైనర్ అయిన శ్రియా మెడలో డైమండ్ నెక్లెస్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా సంప్రదాయ దుస్తులతో ఆనందిత్ ఆకట్టుకున్నాడు.