ఆగస్టు 9న నితిన్ వస్తున్నట్టు ప్రకటించాడో లేదో.. వెంటనే ఆగస్టు 10న తాను కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించాడు కమల్ హాసన్. మోస్ట్ వెయిటెడ్ చిత్రం విశ్వరూపం – 2ఆగస్టు 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే, 2013లో విశ్వరూపం మొదటి భాగం విడుదలై, అనేక కాంట్రవర్సీల మధ్య ఈ చిత్రం వంద కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో రెండో భాగం కూడా విడుదల చేసి మరో సారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని రెండో భాగాన్ని కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు కమల్ హాసన్.
అయితే, విశ్వరూపం -లో కమల్ హాసన్ నటించడమే కాదు, చిత్రానికి కథను అందించి, దర్శకత్వంతోపాటు నిర్మించాడు కూడా. ప్రముఖ నటులు రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. నితిన్ నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్‌గా తెరకెక్కినప్పటికీ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సపోర్టు ఉంది. దీంతో విశ్వరూపం – 2 లాంటి చిత్రం పోటీలో ఉన్నా నితిన్ చాలా ధైర్యంగా కనిపిస్తున్నాడని చిత్ర బృందం విశ్లేషకులు అంటున్నారు.