ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం లేదు. వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ముందడుగు వేస్తున్నారు. కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
వైఎస్ జగన్‌తో చెప్పుకుంటే కష్టాలు తీరుతాయన్న నమ్మకంతో ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో అశేషంగా పాల్గొంటున్నారు. జగన్ అడుగులో అడుగులు వేస్తున్నారు. దీంతో గ్రామాలు, పట్టణ ప్రాంతాలు జగన్‌కు బ్రహ్మరథం పడుతుననాయి. గోదారమ్మ సాక్షిగా వైఎస్ జగన్ వేస్తున్న అడుగులు తమకు ఆశాకిరణాలై కనిపిస్తున్నాయని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చెప్పడం గమనార్హం. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ పాదయాత్ర చేస్తున్న జగన్‌ను ఉద్దేశించి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డే మళ్లీ తమ గడపకు వచ్చినట్టుందని చెప్తున్నారు.