వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను సామరస్యంగా వింటూ.. పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ.. ప్రజల్లో భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇదిలా ఉండగా, కడప జిల్లా ఇపుడుపుల నుంచి పాదయాత్ర చేపట్టిన జగన్‌కు అన్ని జిల్లాలకు మించి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ ఏ సభ పెట్టినా ప్రజలు అశేషంగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా, ఏ జిల్లాలో లేని విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇతర పార్టీల నాయకులు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో అధికార టీడీపీ వర్గాల్లో ఒకింత ఆందోళన నెలకొందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్‌కు పెరుగుతున్న ప్రజల మద్దతుపై ఎప్పటికప్పుడు తన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారని, వైసీపీలో చేరుతున్న.. చేరబోతున్న నేతలు, నాయకుల గురించి చంద్రబాబు ఆరా తీస్తున్నారట. అంతేకాకుండా, చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా నిత్యం టీడీపీ నేతల నుంచి కార్యకర్తల వరకు టచ్‌లో ఉంటున్నట్టు సమాచారం.