తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేదలకు శుభవార్త తెలిపారు .రాష్ట్రంలో సిద్ధిపేట లో మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ ,దుబ్బాక లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తి కావచ్చాయి .అర్హులు ..నిజమైన పేదలకు అత్యంత పారదర్శకంగా ఇళ్ళు కేటాయిస్తామని ఆయన చెప్పారు .
ఇళ్ళు పంపకంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అన్నారు .సిద్ధిపేటలో పంతొమ్మిది వందల అరవై ,గజ్వేల్ లో పదమూడు వందలు ..దుబ్బాకలో వెయ్యి మ,హుస్నాబాద్ లో నాలుగు వందల ఇళ్లులు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు .
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఈ నెల తొమ్మిదో తారిఖు నుండి పన్నెండు వరకు స్వీకరిస్తాము .దరఖాస్తుల పరిశీలన ఈ నెల పదహారు తారిఖు నుండి ఆగస్టు ఐదు వరకు ఉంటుందని మంత్రి తెలిపారు ..