ఏపీ కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై సీతకన్ను వేయడమేనని ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ మంత్రి అచ్చెన్నాయుడును అంతలా బాధించిన విషయం ఏమిటి..? మీడియా సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడే అచ్చెన్నాయుడు మీడియా సమావేశాలకు దూరంగా ఉండటానికి కారణమేమిటి..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.
ఇక అసలు విషయానికొస్తే.. ఏపీ కేబినెట్‌లో మంత్రి స్థాయిలో ఉన్న కింజరపు అచ్చెన్నాయుడుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదట ఈ విషయాన్నే తన అనుచరుల వద్ద చెప్పుకుని మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. చంద్రబాబుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడు తన సొంత మనుషులకు కూడా ప్రభుత్వ పర పనులు చేసి పెట్టలేని పరిస్థితి. ఈ ప్రభావం త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తనపై చూపుతుందని, ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వస్తుందేమోనని తన సన్నిహితుల వద్ద అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారట. చంద్రబాబు ఇప్పటి వరకు తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోవడం, చిన్నచూపుచూడటం, తన వర్గీయులకు ప్రభుత్వ పర పనులు జరగకుండా చేయడం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అచ్చెన్నాయుడు కినుకు వహించారట.
ఏదేమైనా మంత్రి స్థాయిలో ఉండి కూడా తమ పనులు చేయలేకపోతున్నారని తమ వర్గం నేతలే నవ్వుతుండటం అచ్చెన్నాయుడుకు బాధ కలిగించిందట. చివరకు పార్టీ మారదామన్నా కూడా.. ఏ పార్టీ వారు కూడా ఆహ్వానించని పరిస్థితి. దీంతో చేసేదిలేక తలవంపులను ఎదుర్కోనైనా సరే టీడీపీలోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి మంత్రి అచ్చెన్నాయుడుది.