వేసవి కాలం ముగిసినా.. ఏపీలో మాత్రం వేసవి కాలాన్ని తలపించేలా రాజకీయ సెగలు రేగుతున్నాయి. టీడీపీ సర్కార్ ప్రభుత్వ గడువు ముగుస్తుండటం.. సాధారణ ఎన్నికల గుడువు దగ్గర పడుతుండటంతో కొందరు రాజకీయ నాయకుల్లో ఒకింత ఆనందం.. మరికొందరి రాజకీయ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఆందోళనతో ఉన్న రాజకీయ నాయకులు వారి వారి పనితీరుపై, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయాలను సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇలా ఏపీలోని ప్రతీ రాజకీయ పార్టీ ప్రస్తుతం సర్వేలతో ఫలితాలను తేల్చే పనిలో ఉంది.
ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో ఏపీలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పలు సంస్థలు చేసిన సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. చంద్రబాబు సర్కార్ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొందని, ఆ వ్యతిరేకతే వైసీపీని గెలిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు సైత అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని సీనియర్ రాజకీయ నాయకులందరూ వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొందరు రాజకీయ నాయకులు వైసీపీలో చేరగా.. మరికొందరు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
తాజాగా ఆ జాబితాలో ప్రకాశం జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు కూడా చేరిపోయారు. అయితే, కాంగ్రెస్ హయాంలో జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన చంద్రబాబు సర్కార్ హయాంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఏపీలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బ్యాంకులోని నిధులను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు వర్గీయులు తనపై ఒత్తిడి తేవడంతో… అవినీతికి పాల్పడితే ఏ నాటికైనా శిక్ష తప్పదనే ఆలోచనతో బ్యాంకు చైర్మన్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా.. టీడీపీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. ఆ పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపి జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని సోషల్ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి.