తెలంగాణ ఉద్యమ కారుడు ..మచ్చలేకుండా ప్రజల మద్దతు పొందుతున్న యువనేత ..ప్రజాసేవే పరమావిధిగా భావించి రాజకీయంగా దూసుకుపోతున్న దళిత సామాజికవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ .ఎంపీని రాజకీయాల్లో నేరుగా ఎదుర్కునే సత్తా లేక నిరాధారణమైన ఆరోపణలతో సోషల్ మీడియాలో చేస్తున్న అసత్యపు గ్లోబల్ ప్రచారానికిదే మా సమాధానం ..రాష్ట్రంలో మంచిర్యాల పట్టణానికి చెందిన బోయిని సంధ్య ,బోయిని విజేత (అక్కాచెల్లెళ్లు).బోయిని సంధ్య ఎంపీ బాల్క సుమన్ ను ఎక్స్ ప్లయిట్ చేయాలనే ఆలోచనతో తన సోదరితో కలిసి ఎంపీ సుమన్ గారు భార్య ,కుమారుడితో కల్సి దిగిన ఫోటోలో ఎంపీ భార్య స్థానంలో సంధ్య తన ఫోటోను తానె మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో ఆప్ లోడ్ చేసి ఎంపీ గారి భార్య మాదిరిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నించారు .
తద్వారా ఎంపీ గారిని మెసేజ్ ల ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది .ఇదే విషయం గురించి మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో తేది అనగా 27.01.2018రోజున తన సిబ్బంది ద్వారా పిర్యాదు చేయడంతో క్రైమ్ నెంబర్ 42/18ద్వారా 420,419,506 రెడ్ విత్ 34 సెక్షన్ ల ద్వారా 56డీ ఐటీ యాక్ట్ ద్వారా కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు .అయితే ఈ మధ్య కాలంలో తిరిగి అక్కాచెల్లెళ్ళు ఎంపీ గారిని మెసేజ్ ల ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు .ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ఇద్దరిపై 448,506 సెక్షన్ల ద్వారా కేసు నమోదు చేయడం జరిగింది.
మహిళలపై గౌరవ మర్యాదలు ఉన్న ఎంపీ బాల్క సుమన్ మధ్య తరగతి వారిని బజారున ఈడ్చవద్దనే ఆలోచనతో సదరు మహిళలపై ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ చేయడం జరగలేదు ..అయిన కూడా ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడానికి దళిత ఎంపీపై బురద జల్లెందుకు చేస్తున్న ప్రచారాలను మానసిక దాడిగా పరిగణిస్తున్నాం ..ఈ సందర్భంగా మీకు ఓ విన్నపం మీ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్న ఏ ఏజెన్సీ కైనా ..మేజిస్ట్రేట్ కైనా మరే ఇతర సంస్థలకైనా అప్పగిస్తే ఎదురుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ..ఇలాంటి అసత్యపు ప్రచారాలను కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని తెలియజేస్తున్నాం ..