టాలీవుడ్ అర్జున్‌రెడ్డి బాగానే ఉన్నాడు. డైరెక్టర్ సందీప్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం వెంటనే సీక్వెల్ చేసేందుకు రెడీ అంటున్నాడు. కానీ, బాలీవుడ్, కోలీవుడ్ అర్జున్‌రెడ్డిల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కోలీవుడ్‌లో అర్జున్‌రెడ్డి రీమేక్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, హీరోయిన్ విషయమై క్లారిటీ రావడం లేదు. కోలీవుడ్ అర్జున్‌రెడ్డిది కూడా అదే పరిస్థితి.
అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌తో విజయదేవరకొండ సృష్టించిన సెన్షేషన్ అంతా.. ఇంతా కాదనే చెప్పాలి. అందుకే అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌లో నటించేందుకు బాలీవుడ్, కోలీవుడ్ హీరోలు పోటీ పడ్డారు. చివరకు ఆ ఛాన్స్‌ను తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రు, బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ దక్కించుకున్నారు. అయితే, వీరిద్దరికి షాలినీపాండే లాంటి హీరోయిన్ మాత్రం దొరకడం లేదు.
ప్రముఖ దర్శకుడు బాల తమిళంలో వర్మ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే, షాలినీపాండే క్యారెక్టర్‌ను ఎవరు పోసించబోతున్నారు అన్న విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు. గౌతమికూతురు సుబ్బ లక్ష్మీ నటించబోతోందని ఒకసారి.. కమల్ కూతురు అక్షర హాసన్ నటించబోతోందని వినిపించాయి. అయితే, అవన్నీ రూమర్సేనని తేలిపోయింది. ఇప్పుడు మరో రెండు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. కోల్‌కతాకు చెందిన మోడల్ మేఘా కానీ, లేదా తెలుగులో నిర్మలా కాన్వెంట్ స్కూల్లో నటించిన శ్రియాశర్మ కానీ కోలీవుడ్ అర్జున్‌రెడ్డి సరసన నటించే అవకాశాలు ఉన్నాయట.