సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ముద్ర వేసిన నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో కెప్టెన్ సతమతమవుతున్నారు. ఇందుకోసం పలుమార్లు శస్త్రచికిత్సలు కూడా ఆయన చేయించుకున్నారు.
see also:జస్ట్.. టూ పీస్ బికినిలో షారుక్ ఖాన్ కూతురు హల్ చల్
తాజాగా అనారోగ్యానికి గురైన డీఎమ్‌డీకే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయ్యారు. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్తున్నట్లు ట్విట్టర్‌లో విజయ్‌కాంత్ ట్వీట్ చేశారు. ఈ నెల 7వ తేదీన వెళ్తున్నానని, వీడ్కోలు చెప్పేందుకు ఎయిర్‌పోర్టుకు రావొద్దని అభిమానులను కోరారు.
— Vijayakant (@iVijayakant) July 5, 2018